Header Banner

పరారీలో ప్రధాని! పాక్ కు కాళరాత్రి.. పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు!

  Fri May 09, 2025 14:46        Politics

పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతి దాడులకు దిగింది. పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేస్తోంది. ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లు సమాచారం. పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ.. భద్రత నడుమ ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అటు బాంబుల మోతతో పాకిస్తాన్ దద్దరిల్లుతోంది. పాక్ ప్రధాన నగరాలను భారత్ టార్గెట్ చేసింది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, సియాల్ కోట్, బహవల్ పూర్, పెషావర్ లో డ్రోన్లతో బాంబుల వర్షం కురిపిస్తోంది భారత్. ఇండియన్ నేవీ దెబ్బకు పాక్ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. పాకిస్తాన్ బరి తెగించింది. ఓవైపు సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరుపుతున్న పాక్.. అనూహ్యంగా గురువారం రాత్రి భారత్ పై దాడులకు తెగబడింది.

 

ఇది కూడా చదవండి: తిక్క కుదిరిందా పాకిస్తాన్.. తుస్సుమన్న చైనా మాల్.. పాక్ ను మోసం చేసిన చైనా!

 

జమ్మూలోని ఎయిర్ పోర్ట్ సహా అనేక ప్రదేశాలపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసింది. గురువారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది. వెంటనే భారత ఆర్మీ అలర్ట్ అయ్యింది. ప్రతిస్పందనగా భారత ఫైటర్ జెట్లు దూసు కెళ్లాయి. భారత్ తన వైమా నిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ఇది వచ్చే రాకెట్లను విజయ వంతంగా అడ్డుకుంది. పాక్ డ్రోన్లు, జెట్లు, మిస్సైల్స్ ను భారత్ కూల్చేసింది.   గురువారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, సాంబా, ఉరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కవ్వింపు చర్యలకు దిగా యి.జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే భారత్ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ మిస్సై ల్స్, డ్రోన్లను కూల్చేసిం ది.పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర వాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన 48 గంటలలోపు పాకిస్తాన్ భారత్ పై దాడులకు దిగింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations